నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:15

సూర్యాపేట జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య?*

సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద అతడు మంగళవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది .

పెనపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆర్థిక సమస్యలతో కుటుంబ కలహాలు చెలరేగడంతోనే సదరు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:14

రేపు భారత్‌కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ రేపు భారత్‌కు చేరుకోనున్నారు.

ఈ సందర్బంగా ఆయన జైపూర్‌లోని ఆమెర్ కోట, హవా మహాల్‌ను సందర్శిం చనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ ను సందర్శిస్తారు. జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.

చివరగా రాష్ట్రపతి భవన్‌లో రిసెప్షన్‌కు హాజరవుతారు.....

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:13

గడ్చిరోలి నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గ‌ల్లంతు

మహారాష్ట్రలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం నెల‌కొంది.

వైనగంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి.

చాముర్సి తాలుక ఘ‌ణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలో ఏరివేత కు వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

7 గురు వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.అయితే ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి.

ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం. గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణి కులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:12

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది.

యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీక రించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:11

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:09

నేడు విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించానున్నారు.

ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం నిర్వహించ నున్నారు.షర్మిల సమక్షంలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డిపార్టీలో చేరనున్నారు.

మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ పాల్గొంటారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం షర్మిలప్రకటించనుంది...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:08

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది.

అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5లక్షల మంజూరు (ఇందిరమ్మ ఇంటి పథకం) పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

అందులో భాగంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని మూడు పథకాలను ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.

దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా దానిని ఎలా అమలు చేయా లి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందచేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలిసింది.

ఈ పథకాలకు సంబంధించి విధి, విధానాలను కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఏప్రిల్ తరువాత మహిళలకు రూ.2500లు..!

గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా, ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు రూ.5లక్షలను ఇవ్వాలని నిర్ణయించి నట్టుగా తెలిసింది.

అయితే మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.2500లను వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానిని ఏప్రిల్ తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 12:06

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది.

రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు.

అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయ నుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు...

నిజంనిప్పులాంటిది

Jan 23 2024, 14:29

నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

6 జిల్లాల్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ పొందినట్లు సీఐడీ గుర్తించింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.

నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంత మందికి వీసాలను జారీ చేశారు.వీసాల్లో కెనెడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తమున్నట్టు విచారణలో వెల్లడైంది.

పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Jan 23 2024, 14:28

తైక్వాండో ప్రీమియర్ లీగ్ క్రీడలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మంగళవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

తైక్వాండో దుస్తులు ధరించి.. క్రీడాకారులతో సరదాగా పోటీపడి వారిలో ప్రోత్సాహాన్ని నింపారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తెలిపారు...